News

ఆ పేపర్ చదవడం హానికరం


అభివృద్ధిపై చర్చకు సిద్ధమని..సమయం, స్థలం జగన్ నిర్ణయించుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. బుధవారం జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురంలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమర్థుడైన ముఖ్యమంత్రి ఉన్నారు.. సరైన ప్రతిపక్షనేత లేరన్నారు. సాక్షికి, జగన్‌కు అభివృద్ధి కనపడదని... సాక్షి చదవడం హానికరమని లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్‌కు రాష్ట్రం గురించి కనీస అవగాహన లేదని విమర్శించారు. జగన్‌ తెలంగాణలో ఉంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి అభివృద్ధిని చూడాలని నారా లోకేష్‌ అన్నారు.